ఎన్నాళ్లీ హత్యారాజకీయాలు?

హత్యారాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్కక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

Update: 2022-11-17 06:41 GMT

హత్యారాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్కక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుని నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పొల్నాటి శేషగిరిరావుపై వైసీీపీ గూండాల దాడిని ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు హత్యలకు పూనుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

టీడీపీ కార్యకర్తలను...
టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు హత్యా రాజకీయాలకు పూనుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కాపు సామాజికవర్గం పై గొడ్డళ్లతో దాడికి పూనుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయకపోతే మరిన్ని అరాచకాలు జరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని, లేకుంటే ఈ ప్రభుత్వం భయపడదని అచ్చెన్నాయుడు అన్నారు.


Tags:    

Similar News