Chandrababu : ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు
ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. మొత్తం 22 లక్సల ఎకరాల్లో పంట దెబ్బతినిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిందని వివరించారు. మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి సాయం అందించాలని ఆయన కోరారు. మొత్తం పదిహేను జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపిందన్న చంద్రబాబు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ప్రజల సాధారణ జీవితం దెబ్బతినిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పదివేల కోట్ల నష్టం....
పది వేల కోట్ల రూపాయల మేరకు పంట నష్ం జరిగిందన్న చంద్రబాబు అనేక చోట్ల పశువులు చనిపోయాయి రైతులు నష్టపోయారన్నారు. రహదారులు కూడా 770 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ రంగమే కాకుండా ఆక్వా రంగం కూడా భారీగా నష్టపోయిందని ఆయన మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తుఫాను కారణంగా పంట నష్ట పోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. మీరు ప్రకటన చేయాలని, తద్వారా రైతుల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.