Chandrababu : చంద్రబాబు పిలుపుకు భారీ స్పందన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది

Update: 2024-04-12 12:41 GMT

chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ కోసం విరాళాలివ్వాలని చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకోసం వెబ్‌సైట్ ను కూడా చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఐదు వేల మంది కార్యకర్తలు తమ వంతు విరాళాన్ని పార్టికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

విరాళాలివ్వాలని...
టీడీపీ ఫర్ ఆంధ్ర. కామ్ వెబ్‌సైట్ లోకి వెళ్లి విరాళాలు అందించాలని కోరగా అనేక చోట్ల నుంచి మంచి స్పందన లభించినట్లు తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రపంచం నలుమూలల నుంచి ఐదు వేల మంది ఈ పిలుపునకు స్పందించారని చెబుతున్నారు. అయితే ఎంత విరాళం ఇప్పటి వరకూ వచ్చింది అన్నది మాత్రం తెలియపర్చలేదు.


Tags:    

Similar News