ఈరోజు లిస్ట్‌లో లేదే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్వాష్ పిటీషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం లేదు;

Update: 2023-09-26 05:07 GMT
chandrababu, anticipatory bail, fibernet case, supreme court
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్వాష్ పిటీషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం లేదు. లిస్ట్ లో లేకపోవడంతో రేపు విచారణకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. రేపు విచారణకు వచ్చినా ఎప్పుడు దానిని చేపడతారన్నది మాత్రం అక్టోబరు 2వ తేదీన తర్వాతనే తేలనుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఏసీబీ కోర్టులో...
సుప్రీంకోర్టుకు వరసగా సెలవులు ఉండటంతో వచ్చే మంగళవారం కేసు విచారణకు వచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. చంద్రబాబునాయుడు బెయిల్ పిటీషన్ పై వాదనలు నేడు ఏసీబీ కోర్టులో జరగనున్నాయి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది. దీంతో పాటు ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు కూడా విచారణ జరగనుంది.


Tags:    

Similar News