Chandrababu : వరస సభలతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.;

chandrababu at kuppam constituency
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆయన బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ బహిరంగ సభలు వరసగా నిర్వహించనున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో జరగనున్న బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. తొలి విడతగా వచ్చే నెల 5వ తేదీ నుంచి పదో తేదీ వరకూ బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
పార్లమెంటు నియోజకవర్గాల్లో...
జనవరి 5వ తేదీన ఒంగోలు పరిధిలోని కనిగిరిలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. జనవరి ఏడో తేదీన తిరువూరు, ఆచంటలోనూ, జనవరి 9వ తేదీన వెంకటగిరి, ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. జనవరి పదో తేదీన పెద్దాపురం, టెక్కలిలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు జనవరి 29వ తేదీ నాటికి మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.