రెండో రోజు విచారణ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు కూడా సీఐడీ విచారణకు హాజరుకానున్నారు;

Update: 2023-10-11 03:08 GMT
nara lokesh, tdp, cid, inner ring road case
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు కూడా సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. నిన్న ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు నేడు కూడా రావాలని కోరడంతో ఆయన ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ సీఐడీ విచారణకు హాజరు కానున్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ఎ 14 నిందితుడిగా ఉన్నారు. ఆయనను విచారించాలని సీఐడీ అధికారులు 41 ఎ నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో నిన్న విచారణకు హాజరయ్యారు. దాదాపు ముప్పయి ప్రశ్నలు వేశారని చెబుతున్నారు. మరింత సమాచారం కోసం రెండో రోజు కూడా రావాలని కోరడంతో ఈరోజు కూడా లోకేష్ విచారణకు హాజరు కానున్నారు.


Tags:    

Similar News