‍Nara Lokesh : నేడు కాకినాడలోకి యువగళం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కాకినాడలో జరగనుంది;

Update: 2023-12-01 04:26 GMT
nara lokesh, tdp, yuvagalam, kakinada, padayatra
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కాకినాడలో జరగనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 2926.4 కి.మీ. నడిచారు. రోజుకు పది హేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర 214వరోజుకు చేరుకుంది. ఉదయం 8గంటలకు చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. 8.15 గంటలకు గురజనాపల్లి సెంటర్ వద్ద పాదయాత్ర కాకినాడ రూరల్ లోకి ప్రవేశించింది.9.15 గంటలకు కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీలో స్థానికులతో మాట్లాడనున్నారు. 9.40 గంటలకు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.

వరస సమావేశాలతో...
ఉదయం 9.45 గంటలకు కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద డీప్ వాటర్ పోర్టు వర్కర్లతో సమావేశం కానున్నారు.10 గంటలకు ఎంఎస్ ఎన్ చారిటీస్ వద్ద స్థానికులతో సమస్యలపై చర్చించ నున్నారు. 10.30 గంటలకు ఘాటీ సెంటర్ లో లారీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అవుతారు.11.30 గంటలకు సినిమారోడ్డులో వ్యాన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. 11.35 గంటలకు సాయిబాబా మార్కెట్ సెంటర్ లో డ్వాక్రా మహిళలు, ఉద్యోగులతో భేటీ కానున్నారు. సాయంత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశిస్తుంది. సర్పవరం జంక్షన్ లో బహిరంగసభలో లోకేష్ పాల్గొంటారు. రాత్రికి యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు.


Tags:    

Similar News