టీడీపీ ఎమ్మెల్యేల నిరసన
ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఏపీ పయనిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఏపీ పయనిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి పదిన్నర లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని, పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లే ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు. మిగిలిన నిధులు ఏమయ్యాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నాలుగేళ్లలో తొమ్మిది లక్షల కోట్లు పైచిలుకు అప్పులు చేశారని, ఏపీని జగన్ అప్పుల రాష్ట్రంగా మార్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
నిరసనలో బాలకృష్ణ...
మరోవైపు ఈరోజు శాసనసభకు నిరసన తెలుపుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బయలుదేరారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ శాసనసభా పక్షం నిరసన తెలియచేసింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాల చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.