TDP : హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ పరం
హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.;
హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ కార్పొరేటర్లు పదకొండు మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ నీరజ తన పదవికి రాజీనామా చేశారు. హిందూపురంలో మొన్నటి వరకూ వైసీపీ అధికారంలో ఉండేది. మున్సిపాలిటీలో అత్యధికంగా కౌన్సిలర్లు వైసీపీ తరుపున గెలిచారు.
నందమూరి బాలకృష్ణ మంత్రాంగంతో...
అయితే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రాంగంతో వైసీపీకి చెందిన పదకొండు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారిని పార్టీ కండువాలు కప్పి బాలకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. దీంతో హిందూపురం మున్సిపాలిటీ వైసీపీ చేతుల్లో నుంచి టీడీపీ కైవసం చేసుకుంది.