మే 2 నుంచి ఇంటర్ పరీక్షలు ?

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. తెలంగాణలో మే 2వ

Update: 2022-01-08 05:57 GMT

ఇంటర్ విద్యార్థులకు సక్రమంగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించి రెండేళ్లయింది. ఈ విద్యాసంవత్సరంలోనైనా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. తెలంగాణలో మే 2వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉండవచ్చని చెప్పిన బోర్డు.. కోవిడ్ కారణంగా కాలేజీలు ప్రారంభమవ్వకపోవడం, ఆఫ్ లైన్ తరగతులు ఆలస్యంగా నిర్వహించడం, థర్డ్ వేవ్ తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని మే నెలలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

మే 2వ తేదీన పరీక్షలను ప్రారంభించి, 20వ తేదీకి పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. అటు ఏపీలోనూ మే నెలలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 5వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. థర్డ్ ఎఫెక్ట్ లేకపోతే మే నెలలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు అధికారులు యోచిస్తున్నారు.


Tags:    

Similar News