తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత

తాడేపల్లిలోనివైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తిరుమల లడ్డూ వివాదంపై బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు;

Update: 2024-09-22 07:59 GMT
tension,  ys jagans residence, tadepalli,  bjym
  • whatsapp icon

తాడేపల్లిలోని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తిరుమల లడ్డూ వివాదంపై బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరుమల లడ్డూలో జంతువుల నూనెను కలిపారంటూ వస్తున్న ఆరోపణలపై బీజేవైఎం స్పందించింది. ఇలాంటి కల్తీ నెయ్యిని వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ జగన్ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

పోలీసులు అదుపులోకి తీసుకుని...
నినాదాలు చేస్తూ నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇంతటి నీచమైన కార్యక్రమానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


Tags:    

Similar News