ఉద్యోగుల్లో టెన్షన్... జీతాలు పడతాయా?
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలయింది. పాత జీతాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చీఫ్ సెక్రటరీకి తెలియజేశాయి
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలయింది. ఒకటో తేదీ దగ్గరపడుతుండటంతో జీతాల మ ఖాతాల్లో పడతాయా? లేదా? అన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. పాత జీతాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చీఫ్ సెక్రటరీకి తెలియజేశాయి. కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు చెల్లించవద్దంటూ ఆందోళనకు దిగాయి. అయితే ఒకటో తేదీ దగ్గరపడుతుంది. ప్రభుత్వం మత్రం కొత్త పీఆర్సీ ప్రకారమే జీతీాలు చెల్లించేందుకు సిద్దమయింది.
అన్ని ట్రెజరీలకు....
ఇప్పటికే అన్ని ట్రెజరీలకు ఆదేశాలు వెళ్లాయి. ఉద్యోగ సంఘాలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఏ జీతాలు పడతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రభుత్వం నుంచి ఈరోజు మరోసారి ఉద్యోగ సంఘాలను చర్చకు ఆహ్వానించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.