Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ కారణమదేనట

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది;

Update: 2025-03-19 02:46 GMT
today darsan time in  tirumala, crowd, devotees, wednes day
  • whatsapp icon

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తజనంతో తిరుమల గిరులు పులకరించిపోతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

ఎండ తగలకుండా...
ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే భక్తుల రద్దీ ఇంతగా పెరగడంపై గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని భావించిన భక్తులు శ్రీవారిని ముందుగానే దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే భక్తులు ఎండ తీవ్రతకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మజ్జిగ, మంచినీటిని నిరంతరం అందిస్తున్నారు. ఎండ వేడిమి తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,487 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,909 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News