Tirumala : నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ అంతగా లేదు. నేరుగా స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ అంతగా లేదు. నేరుగా స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది. నిన్నటి వరకూ భక్తులతో కిటికిటలాడిన తిరుమలలో నేడు రద్దీ అంతగా లేదు. సాధారణంగానే ఉంది. సెలవులు లేకపోవడం, అనేకచోట్ల వర్షాలు కురుస్తుండటంతో భక్తుల సంఖ్య కూడా తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 61,640 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 19,064 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశముంది. సర్వదర్శనం క్యూలైన్లలో టోకెన్లు లేని భక్తులకు దర్శన సమయం ఏడుగంటలు పడుతుందని అధికారులు వెల్లడించారు.