యూనివర్సిటీ వద్దకు వచ్చి మంచు మనోజ్.. ఉద్రిక్తత

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి;

Update: 2025-01-15 11:56 GMT

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీ వద్దకు మంచు మనోజ్ రావడంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని మంచు మనోజ్ అన్నారు. తన నాయనమ్మ, తాతయ్య విగ్రహాలకు నివాళులర్పించడానికి కూడా పోలీసులు అనుమతించలేదని అన్నారు.

ఇరువర్గాలకు చెందిన బౌన్సర్ల మధ్య...
అయితే న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపితే.. తనకు న్యాయస్థానం ఆదేశాలు అందలేదని తెలిపారు. ఉద్రిక్తతల మధ్య మంచు మనోజ్ దంపతులు యూనివర్సిటీ లోపలకు వెళ్లి నానమ్మ, తాతయ్య విగ్రహాలకు నివాళులర్పించారు. దీనికి పరిష్కారం ఏంటో తనకు తెలియదని మంచు మనోజ్ అన్నారు. తాను ఇక్కడే ఉంటానని, నాడు తనను ఇంట్లోకి రానివ్వలేదని, నేడు యూనివర్సిటీలోకి కూడా రానివ్వకపోవడంపై తాను తేల్చుకుంటానని మంచు మనోజ్ అన్నారు.


Tags:    

Similar News