సమోసా తిని ముగ్గురు విద్యార్థులు మృతి

కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.;

Update: 2024-08-19 06:53 GMT
samosa, eating, three students died, andhra pradesh
  • whatsapp icon

కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఒక అనాధాశ్రమంలో సమోసా తినడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

మరికొందరు విద్యార్థులు...
మృతి చెందిన విద్యార్థులు జాషువా, భవాని, శ్రద్థ అని పోలీసులు తెలిపారు. మరో ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరిని అనకాపల్లి, మరికొందరిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కలుషితాహారం వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News