పెద్దపులి పిల్లలు.. భయంలో గ్రామస్థులు
నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు లభ్యమయ్యాయి. వాటిని చూసిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు
నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు లభ్యమయ్యాయి. పులిపిల్లలను చూసిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తల్లి పులి తన పిల్లలను గ్రామంలో వదిలి వెళ్లిపోయింది. అయితే పులిపిల్లలను చూసిన గ్రామస్థులు అక్కడే పులి ఉంటుందని భావించి కొంత భయపడ్డారు. అయితే అక్కడ చివరకు లేకపోవడంతో వాటిని సంరక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
జాడలేని తల్లి పులి...
నంద్యాల జిల్లాలోన ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మాడపురం గ్రామంలో పెద్దపులి పిల్లలు కనిపించడంతో గ్రామస్థులు భయపడిపోయారు. పెద్ద పులి కూడా ఇక్కడే ఉంటుందని వారు తొలుత వాటి దగ్గరకు వెళ్లేందుకు జంకారు. అయితే పులిపిల్లలపై కుక్కలు దాడి చేసే అవకాశం ఉండటంతో వారిని సంరక్షించి ఒక గదిలో భద్రపరిచారు. అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.