తిరుమల శ్రీవారి దర్శనం.. ఎన్ని గంటలంటే?

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

Update: 2023-08-01 02:48 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 1 కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం 68,601 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 23,396 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

అధిక శ్రావణ మాస పౌర్ణమి గరుడసేవ తిరుమలలో ఆగష్టు 1న జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు. పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో టీటీడీ షవర్లు ఏర్పాటు చేసింది. భక్తులు వీటిని వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.


Tags:    

Similar News