Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శనివారం కావడంతో పాటు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. వీకెండ్ సాధారణంగా భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకు కోసం టీటీడీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కంపార్ట్‌మెంట్లన్నీ....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడుగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,330 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.