Tirumala : ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. గురువారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతో తిరుమల వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ...
గత కొద్ది రోజులు నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు పూర్తవుతుండటంతో పాటు దేశమంతా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వాతావరణం చల్లబడటం కూడా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించని భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.