Tirumala : తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందో తెలిస్తే షాకవుతారు అంతే
తిరుమలలో రద్దీ ఎక్కువగానే ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు;
తిరుమలలో రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్నటి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ముందుగానే టిక్కెట్లు బుక్ కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి లక్షల సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడు పోయాయి. నిన్నటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. వైకుంఠ ఏకాదశి కావడంతో నిన్న ఎక్కువ మంది వీఐపీలు తిరుమలకు తరలి వచ్చారు.
తొక్కిసలాట ఘటనతో...
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనతో రద్దీ తగ్గుతుందని భావించినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు కూడా రద్దయ్యాయి. ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల 19వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి అధికారులు అందుకు అనుగుణంగా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు...
అయితే హుండీ ఆదాయం మాత్రం తక్కువగానే ఉంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు హుండీ ఆదాయం తగ్గడం మామూలేనని అధికారులు సయితం చెబుతున్నారకు. నిన్న తిరుమల శ్రీవారిని 60,094 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి చెంత 14,906 మంది తమ తలనీలాలను సమర్పించారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.45 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కావడంతో త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.