తిరుమల దర్శనానికి ఇప్పుడు వెళ్తే..!
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,728 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. స్వామివారికి 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి జూలై నెలలో రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. జులై నెలలో ఏకంగా రూ.129.03 కోట్ల హుండీ ఆదాయం లభించింది. జులై 1 నుంచి 31వ వరకు 23.23 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. జులై 9న అత్యధికంగా 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 17న హుండీ ఆదాయం రూ.5.40 కోట్లు వచ్చింది. ఇక జులై 31వ తేదీన శ్రీవారికి రూ.5.21 కోట్లు వచ్చింది. జులై 10, జులై 24న కూడా రూ.5 కోట్ల మార్కును అందుకుంది.