Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక వసతి గృహాలు సులువు
తిరుమలకు వెళ్లే భక్తులకు సులువుగా వసతి గృహాలు దొరికేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు;

తిరుమలకు వెళ్లే భక్తులకు సులువుగా వసతి గృహాలు దొరికేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు దర్శనం ఎన్ రోల్ మెంట్ పైనే గదులు కేటాయించే విధానాన్ని అమలు చేశారు. నిన్నటి నుంచి విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకూ దర్శనం టిక్కెట్లు వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వేర్వుగా వెళ్లాలి. అలాగే సిఫార్సులేఖలను వసతి గృహాల కోసం మరో జిరాక్స్ కాపీని తీసుకు రావాల్సి ఉంది. ఈవోకార్యాలయంలో గంటల తరబడి వసతి గృహాల కేటాయింపు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.
వేచి ఉండకుండానే...
అదనపు స్టాంపింగ్ ను ఈవో కార్యాలయ సిబ్బంది వేస్తేనే వసతి గృహాలను కేటాయిస్తారు. అయితే తాజాగా ఇందులో మార్పు తీసుకు వచ్చారు. క్యూ లో ఎక్కువ సమయం వేచి ఉంకుండానే దర్శనం ఎన్ రోల్ మెంట్ స్లిప్ తోనే ఇక గదులు భక్తులకు కేటాయించనున్నారు. దీనవల్ల భక్తులు పెద్దగా క్యూ లైన్ లో వేచి ఉండకుండానే తాము గదులు పొందే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కల్పించారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు తీసుకు వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.