తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమలకు వచ్చేభక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు.;

Update: 2025-04-14 03:36 GMT
tirumala tirupati devasthanams, devotees,  good news, tirumala
  • whatsapp icon

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమలకు వచ్చేభక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీవారి దర్శనం సులువుగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తిరుమలలోని శ్రీవారి దర్శనం ఇక సులువుగా మారనుంది. శ్రీవారి దర్శనం లో ఏఐఐ సాంకేతికత వినియోగించుకుంటున్నారు. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలిపిరి వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. పదిహేను హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం అయ్యాయి. అలిపిరి వద్దే ప్రయివేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రిక్ బస్సుల్లో కొండ పైకి తీసుకెళ్లనున్నారు. అలిపిరి వద్దే వసతితో పాటుగా అన్ని కౌంటర్ల ఏర్పాటుకు ఓకే చెప్పారు.

అలిపిరి వద్ద బేస్ క్యాంపు...
తిరుమలకు వచ్చే భక్తులు కొండపైనవసతి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేారు. అలిపిరి వద్దే భక్తులకు వసతితో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులు అన్ని రకాల సేవలు అలిపిరిలోనే పొందే అవకాశం కలుగుతుంది. తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ తగ్గించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటుగా వాహన రద్దీ, కాలుష్యం తగ్గించేలా బేస్ క్యాంపులో సౌకర్యాలు కల్పిస్తున్నారు.


Tags:    

Similar News