నేటీ నుంచి ఏపీలో "టోల్" బాదుడు

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-04-01 02:14 GMT

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు దూరము, వసతులను బట్టి ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకూ టోల్ ఫీజు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోమీటరుకు 13 పైసలు చొప్పున పెంచారు. పెరిగిన కొత్త రేట్లు ఈ రోజు నుంచి అమలులోకి రానున్నాయని, వాహనదారులు సహకరించాలని టోల్ ప్లాజా నిర్వాహకులు కోరుతున్నారు

అన్ని టోల్ ప్లాజాల వద్ద.....
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 56 టోల్ ప్లాజాలున్నాయి. వీటి ద్వారా పెరిగిన రేట్ల ప్రకారం రోజుకు 6.6 కోట్లు వసూలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి అసలే వాహనదారులు ఇబ్బంది పడుతుంటే టోల్ ఫీజులు కూడా పెంచి దోపిడీకి ప్రభుత్వాలు తెరలేపాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News