టమాటా ధరలు.. ఇంత దారుణమా?
జులై నెలలో టమాటాల ధరలు 100-200 పలికాయి. జూలై నెలాఖరు నుంచి
కొద్దిరోజుల కిందట వందల్లో పలికిన టమాటా ధరలు ఇప్పుడు భారీగా పతనమయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా ధరలు దిగి వచ్చాయి. రైతులు సుమారు 10 టన్నుల టమాటాను మార్కెట్‌కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. కిలోకు రూ.10 వస్తోందని రైతులు వాపోతున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతోంది. మదనపల్లె, అనంతపురం జిల్లాలోని మార్కెట్‌లలో కూడా టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్‌లలో కిలో టమాటాకు రూ.20-40 పలుకుతోంది. జులై నెలలో టమాటాల ధరలు 100-200 పలికాయి. జూలై నెలాఖరు నుంచి ధరలు మెల్లిగా పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు రూ.10కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధరలు దక్కడం లేదని అంటున్నారు.