ఆపరేషన్ మదర్ టైగర్ విఫలం
నంద్యాల జిల్లాలో పులిపిల్లలను వదిలివెళ్లిన తల్లి జాడ తెలియలేదు. దీంతో అధికారులు నిరాశతో వెనుదిరిగారు
నంద్యాల జిల్లాలో పులిపిల్లలను వదిలివెళ్లిన తల్లి జాడ తెలియలేదు. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మాడపురం గ్రామంలో పెద్దపులి పిల్లలను మూడు రోజుల క్రితం నాలుగు పిల్లలను వదిలేసి తల్లి వదిలిపోయింది. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు పులి పిల్లలను ఆత్మకూరు ఫారెస్ట్ కేంద్రంలో సంరక్షణగా ఉంచారు. అయితే పులి పిల్లలు తల్లి లేకుండా ఉండటం క్షేమకరం కాదని భావించిన అధికారులు వాటిని తిరిగి తల్లి వద్దకు పంపేందుకు సిద్ధమయ్యారు.
తల్లి జాడ లేక...
ఇందుకోసం పెద్ద ఆపరేషన్ ను చేపట్టారు. పులి జాడలను బట్టి అక్కడకు వెళ్లి పులిపిల్లలను వదిలేయాని భావించారు. కానీ మూడు రోజులైనా తల్లి జాడ లేదు. డ్రోన్ లతోనూ, కెమెరాలతోనూ పులి జాడ కోసం వెదుకులాట ప్రారంభించారు. అయితే ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మాడపురం గ్రామంలో పెద్దపులి గ్రామస్థులకు కనిపించింది. పులి పిల్లలను తల్లి వద్ద వదిలేయాని ఆ ప్రాంతంలో రాత్రంతా సంచరించినా ఫలితం లేకుండా పోవడంతో తిరిగి పులి పిల్లలను ఆత్మకూరు అటవీ కేంద్రానికి అధికారులు తీసుకెళ్లారు.