Tirumala : తిరుమలలో భవనాలకు మేమిచ్చే పేర్లనే పెట్టాలి
తిరుమలలో నిర్మించిన భవనాలకు సొంత పేర్లను వినియోగించడానికి వీలు లేదని టిటిడి ఈవో శ్యామల రావు తెలిపారు.
తిరుమలలో నిర్మించిన భవనాలకు సొంత పేర్లను వినియోగించడానికి వీలు లేదని టిటిడి ఈవో శ్యామల రావు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించిన అది జరగలేదన్నారు. తిరుమల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలన్నారని తెలిపారు. 2019లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ఎవరికి తెలియని పరిస్థితి నెలకొందని శ్యామలరావు తెలిపారు. ఒక ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదని ఈవో శ్యామలరావు తెలిపారు. చారిత్రాత్మక చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు నగరంలో జరగడం లేదని ఆయన అన్నారు.
పవిత్రత అనేది లేకుండా...
పవిత్రత అనేది లేకుండా భవన నిర్మాణాలు చేశారన్న శ్యామలరావు తిరుమలలో కట్టిన నిర్మాణాలు సోంత పేర్లు ఉండకూడదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కోన్ని పేర్లు ఇస్తామని, అదే పేర్లు ఆయా గెస్ట్ హౌలకు పెట్టుకోవాలని ఈవో శ్యామలరావు సూచించారు. తిరుమలలో కట్టే టౌన్ ప్లానింగ్ ప్రకారం నిర్మించాలన్నారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుమలలో నిర్మాణాలు చేపట్టారని, సరైన నిబంధనలు లేకుండా కట్టినవారిపై చర్యలు తీసుకుంటామని శ్యామలరావు హెచ్చరించారు. నూతన టౌన్ ప్లాన్ విభాగాన్ని ఎర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్న శ్యామలరావు, 25 సంవత్సరాలకు సంబందించిన ఒక విజన్ డాక్యుమెంటరీ తయారు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఆయన తెలిపారు. తిరుమలలో మల్టిలేవల్, స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ లు నిర్మాణం చేయాల్సిందన్న ఆయన బాలాజీ బస్టాండ్ ను వేరేచోటకు తరలించాల్సిందని అభిప్రాయపడ్డారు.