వాగు దాటుతుండగా.. టీచర్ కొట్టుకుపోయి?

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఒట్టెగెడ్డ వాగు ప్రవాహంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు కొట్టుకుపోయారు;

Update: 2024-08-16 12:34 GMT
government employees,  washed away, ootagedda stream,  parvathipuram manyam district
  • whatsapp icon

భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. ఉన్నట్లుండి వాగులు పొంగి పొరలుతున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఒట్టెగెడ్డ వాగు ప్రవాహంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు కొట్టుకుపోయారు. ఏకలక్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆర్తితో పాటు, హాస్టల్ వార్డెన్ మహేశ్ లు కలసి ద్విచక్రవాహనంపై పాఠశాలకు వెళుతున్నారు.

ఒకరు ప్రాణాలను ...
అయితే మార్గమధ్యంలో ఒట్టిగెడ్డ వాగు ఒక్కసారి పొంగడంతో నీటి ఉదృతికి ఇద్దరూ బైక్ తో సహా కొట్టుకుపోయారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత మహేశ్ ఒక చెట్టు ఆసరాగా దొరకడంతో కొమ్మను పట్టుకుని ప్రాణాలను రక్షించుకోగలిగారు. ఉపాధ్యాయురాలు ఆర్తి మాత్రం కొట్టుకుపోయారు. ఆమె కోసం స్థానికులతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News