ఈ నెల 19న ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు;

Update: 2025-01-16 07:47 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆయన గన్నవరంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీన అధికారిక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశముంది. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.

చంద్రబాబు నివాసంలో విందు...
18వ తేదీ రాత్రికి విజయవాడ చేరుకోనున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని తన నివాసంలో విందు ఇవ్వనున్నారని తెలిసింది. ఈ మేరకు అమిత్ షా ఏపీ టూర్ కన్ఫర్మ్ కావడంతో ఈ పర్యటనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ పరిణామలపై కూడా కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News