26 గంటల తర్వాత.. శాంతించిన మున్నేరు
విజయవాడల మధ్య రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. రాకపోకల నిలిపివేతతో వాహనదారులు..
కృష్ణాజిల్లా కీసర టోల్ గేట్ సమీపంలోని నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వాగు హైవే పై ప్రవహిస్తుండటంతో.. గురువారం సాయంత్రం నుంచి విజయవాడ - హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడల మధ్య రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. రాకపోకల నిలిపివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలను గుంటూరు మీదుగా మళ్లించినప్పటికీ.. అప్పటికే టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న వాహనదారులు వెనక్కి వెళ్లే దారిలేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
మున్నేరుతో పాటు కట్టలేరు ప్రవాహం కూడా పెరగడంతో.. హైవేపై రెండు అడుగుల మేర వరద చేరింది. వాగు ప్రవాహం తగ్గేంతవరకూ పడిగాపులు పడ్డారు. మొత్తానికి 26 గంటల తర్వాత హైవేపై మున్నేరు వరద ప్రవాహం తగ్గడంతో.. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. ముందుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అనుమతించారు. ఒక్కొక్క వాహనాన్ని పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు.