విజయవాడ - హైదరాబాద్ హైవేపైకి వరద నీరు.

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి;

Update: 2024-09-01 04:13 GMT
central government, announced, huge assistance,  two telugu states
  • whatsapp icon

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారిపై కూడా నీరు మోకాలి లోతులో చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి.

నిలిచిపోయిన వాహనాలు...
దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వేలాది వాహనాలు రాత్రి నుంచి రోడ్లపైనే ఉన్నాయి. కొన్ని ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను భారీ వర్షాల కారణంగా రద్దు చేసింది.


Tags:    

Similar News