chandrababu: టెన్షన్.. బెయిల్ పై నేడు తీర్పు.. బెయిల్ వస్తుందా? రాదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు రానుంది

Update: 2023-11-20 06:07 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు రానుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటీషన్ పై హైకోర్టు విచారణ పూర్తి చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈరోజు వస్తుందని జాబితాలో పేర్కొనడంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

గడువు ముగుస్తున్న సమయంలో...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో యాభై రెండు రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో వారం రోజుల్లో ఆయన రాజమండ్రి జైలుకు తిరిగి వెళ్లాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ ముగుస్తున్న సమయంలో ఈ రోజు హైకోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాజకీయంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.


Tags:    

Similar News