ఏపీ బ్లాక్ లో వంటనూనెలు.. సామాన్యుడి జేబుకు చిల్లు

ఏపీలో బ్లాక్ లో వంటనూనెల అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారుల దాడులతో ఈ బాగోతం బయటపడింది.

Update: 2022-03-07 08:58 GMT

తిరుపతి : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 12 వ రోజుకు చేరింది. యుద్ధం మొదలైన తొలిరోజు నుంచే.. దాని ప్రభావం భారత్ పై ఉంటుందన్న ప్రచారం జరిగింది. దాంతో స్థానిక వ్యాపారులు నిత్యావసర ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా వంటనూనెల ధరలు అధిక రేట్లు పలుకుతున్నాయి. ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అదేమని వినియోగదారుడిని ప్రశ్నిస్తే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపిస్తూ.. జేబుకు చిల్లు పెడుతున్నారు.

తాజాగా ఏపీలో బ్లాక్ లో వంటనూనెల అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారుల దాడులతో ఈ బాగోతం బయటపడింది. తిరుపతిలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అధికమొత్తంలో వంటనూనెలను బ్లాక్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. తూనికలు, కొలతలు శాఖ సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీల కోసం 5 ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. తిరుపతిలో 9, చిత్తూరులో 4, పీలేరులో 2 దుకాణాల పై కేసులు నమోదు చేశారు.







Tags:    

Similar News