అతి త్వరలో జగన్ పై దాడి కేసులో నిందితుడిని పట్టుకుంటాం
ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా ఎన్నికల కమిషనర్ కు వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా ఎన్నికల కమిషనర్ కు వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆరోజు వైఎస్ జగన్ ర్యాలీ 22 కిలోమీటర్ల వరకూ జరిగిందన్నారు. తగిన రీతిలో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. 1400 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ మీనాకు తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, ఐజీ రవిప్రకాష తో ఎన్నికల కమిషనర్ మీనా సమావేశమయ్యారు.
1400 మందితో బందోబస్తు...
ప్రముఖల పర్యటనలో భద్రతను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మీనా వారికి సూచించారు. దర్యాప్తు ప్రగతిని మీనాకు వివరించారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. క్రాంతి రాణా తర్వాత మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితులను విచారించి నిందితులు ఎవరో పట్టుకుంటామని తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతంలో అణువణువును పరిశీలిస్తున్నామని తెలిపారు. సెల్‌ఫోన్ టవర్ డేటాతో పాటు సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నామన్నారు.