Breaking : కుప్పం నియోజకవర్గంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా

కుప్పం నియోజకవర్గంలో వాలంటీర్లు పదవులకు రాజీనామా చేశారు. 384 మంది వాలంటీర్లు తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.;

Update: 2024-04-07 05:53 GMT
Breaking : కుప్పం నియోజకవర్గంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా
  • whatsapp icon

కుప్పం నియోజకవర్గంలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. 384 మంది వాలంటీర్లు తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ కు మద్దతుగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. తాము భరత్ కు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నట్లు వాలంటీర్లు తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాలతో...
పింఛను పంపిణీతో సహా సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయకుండా వాలంటీర్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా వారు తప్పుకుంటూ తాము వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెబుతున్నారు.


Tags:    

Similar News