శాంతిస్తున్న గోదారి.. ఇంకా నీటిలోనే లంక గ్రామాలు

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతి తగ్గుతుంది. బ్యారేజీ నుంచి 23.30 లక్షల క్యూసెక్కుల నీటినివిడుదల చేస్తున్నారు

Update: 2022-07-18 04:10 GMT

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 23.30 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు గోాదావరి వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

వరద ఉధృతి తగ్గే వరకూ..
వరద సహాయక చర్యల్లో పది ఎన్డీఆర్ఎఫ్, పది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. గోదావరి వరద ప్రభావం ఆరు జిల్లాల్లోని 61 మండలాల్లో 382 గ్రామాలు కన్పించింది. 241 గ్రామాల్లో వరద నీరు చేరిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ లంక గ్రామాల నుంచి 97,205 మందిని 191 పునరావాస కేంద్రాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్ లను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News