ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఇస్తున్న హెచ్చరికలు ఇవే..!

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండబోతోందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది

Update: 2023-07-22 02:07 GMT

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండబోతోందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా వర్షాలు భారీగా పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఆదివారం నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ లోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో 16 ఈఆర్డీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News