Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు తప్పవా
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే నాలుగైదు
weather update: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే నాలుగైదు రోజులు పొగమంచు ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళలో పొగ మంచు కారణంగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ సమయంలో ప్రయాణాలు చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి.. దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ వివరించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములతో కూడి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.