Ys Jagan : జీఏడీకి లేఖ రాసిన జగన్.. తన ఇంట్లో సామాన్లను?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కు లేఖ రాశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కు లేఖ రాశారు. తన ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని ఆ లేఖలో కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నిచర్ ను కొనుగోలు చేశామని, తాడేపల్లి ఇంటిని తాను క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నందున అందులో ఫర్నీచర్ ను వాడుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ నిధులతో...
అయితే ఆ ఫర్నీచర్ ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసింది కాబట్టి తిరిగి తీసుకెళ్లవచ్చని లేఖతో జగన్ పేర్కొన్నారు. అందులో కొంత ఫర్నీచర్ ను తాను డబ్బులిచ్చి కొనుగోలు చేస్తానని, అందుకు అనుమితివ్వాలంటూ జీఏడీ అధికారులకు రాసిన లేఖలో కోరారు. ఫర్నీచర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని వైఎస్ జగన్ తెలిపారు.