Ys Jagan : అధైర్యం వద్దు... అందరికీ అందుబాటులో ఉంటా

రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమేనని వైసీపీ అధినేత జగన్ అన్నారు;

Update: 2024-06-14 08:08 GMT
Ys Jagan : అధైర్యం వద్దు... అందరికీ అందుబాటులో ఉంటా
  • whatsapp icon

రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమేనని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఎంత సహజమో.. ఓటమి కూడా అంతే సహజమని అన్నారు. ఓటమిని చూసి ఎవరూ కుంగిపోవద్దని జగన్ నేతలకు తెలిపారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి, లోక్‌సభలో మిధున్ రెడ్డి నేతలుగా కొనసాగుతారని చెప్పార.

ధైర్యం కోల్పోవద్దు...
రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు ముఖ్యమన్న జగన్ తాను నేతలందరికీ అందుబాటులో ఉంటానని, ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని వైఎస్ జగన్ తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని జగన్ తెలిపారు. అందరూ కలసి కట్టుగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన నేతలకు తెలిపారు.


Tags:    

Similar News