Ys Jagan : నేడు నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈమసావేశానికి నెల్లూరుజిల్లాకు చెందిన జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలు హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశంలో జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీని బలోపేతం...
నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు స్థానిక సమస్యలపై ఆందోళన చేయాలని జగన్ పిలుపు నివ్వనున్నారు. తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అందుకు ఇప్పటి నుంచే కష్టపడి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కార్యకర్తలను కలుపుకుని పోవాలని జగన్ పిలుపు నివ్వనున్నారు.