Ys Jagan : నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈరోజు పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్ వరసగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
భవిష్యత్ ఉంటుందని...
పార్టీలో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని వారికి వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రతినిధులతో భేటీ అయిన వైఎస్ జగన్ నేడు మరికొందరు ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఖచ్చితంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి పదవులు ఇస్తామని స్వయంగా జగన్ హామీ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో కలసి ఫొటోలు దిగుతున్నారు.