Ys Jagan : ముగిసిన జగన్ కడప జిల్లా పర్యటన

కడప జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. జగన్ ఈరోజు కడప నుంచి తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు

Update: 2024-10-31 03:42 GMT

 ys jagan

కడప జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. జగన్ ఈరోజు కడప నుంచి తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. గత రెండు రోజుల నుంచి కడప జిల్లా పులివెందులలోనే జగన్ మకాం వేశారు. అక్కడే ఉండి ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ప్రజల నుంచి అనేక వినతి పత్రాలను స్వీకరించారు.

తిరిగి బెంగళూరుకు...
వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కొన్ని సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. వెంటనే పరిష్కరించాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా జగన్ ఈ రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. కడప జిల్లాలో పార్టీ బలోపేతం పై చర్చించారు. కలసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు తిరిగి కడప నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.


Tags:    

Similar News