YSRCP : ఈసీపై సజ్జల ఫైర్.. తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరొకలా
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
sajjala ramakrishna reddy
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెలంగాణకు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ కు ఒక న్యాయమా? అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ కు ఈసీ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
ఆన్ గోయింగ్ పథకాలకు...
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల కమిషన్ ఎందుకు వివక్ష చూపుతోందని ఆయన ప్రశ్నించారు. ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర వుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆన్ గోయింగ్ పథకాలకు అన్ని రాష్ట్రాల్లో అనుమతులు ఇస్తూ ఒక్క ఏపీలోనే బ్రేక్ వేయడం ఈసీ ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుందనడానికి నిదర్శనమని తెలిపారు.