పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి ఏమన్నారంటే?
వైసీపీ నేత అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేత అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో అప్పటికే లెక్టర్లు పట్టుకున్న రేషన్ బియ్యాన్ని చూడటానికి పవన్ కల్యాణ్ వెళ్లారన్నారు. సాహసోపేతంగా కాకినాడ పోర్టులో ఆయన పర్యటన సాగిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఒడ్డుకు చేరుకున్నాక మాత్రం పవన్ కల్యాణ్ తన పర్యటనకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యానించారని,ఆయన ప్రభుత్వంలో ఉన్నారా? లేదా ప్రతి పక్షంలో ఉన్నారా? అంటూ అంబటి రాంబాబు సెటైర్ వేశారు.
పోర్టులో బియ్యం ఎగుమతులు...
కాకినాడ పోర్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బియ్యం ఎగుమతులు జరుగుతుంటాయని, అయిత ఆబియ్యంలో పీడీఎస్ బియ్యం కలిపి పంపడమే పెద్ద కుంభకోణమని అంబటి రాంబాబు వివరించారు. ఈ స్కామ్ ఎప్పటి నుంచో నడుస్తుందన, గత ప్రభుత్వం కూడా దీనిని కట్టడి చేసే ప్రయత్నం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించడం మాట పక్కన పెట్టి, సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చివరకూ బూడిద కోసం ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కొట్టుకుంటున్నారన్నవ ిషక్ష్ం గుర్తు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ నడుస్తుందని, బార్ల నుంచి కూడా వసూలు చేస్తున్నారన్న రాంబాబు ఏపని జరగాలన్నా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.