లోకేష్‌.. నీది రాయలసీమనా?: అవినాష్‌ రెడ్డి ఫైర్‌

నారా లోకేష్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందించారు. లోకేశ్ విమ‌ర్శ‌ల‌పై అవినాష్‌రెడ్డి అదిరిపోయే

Update: 2023-06-13 11:11 GMT

ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర పూర్తి చేసుకోనున్న టీడీపీ నేత నారా లోకేష్‌.. తాజాగా చేసిన కామెంట్స్‌ వైసీపీలో మంటలు రేపాయి. వైసీపీ ఎమ్మెల్యేల లక్ష్యంగా రాయలసీమలో యాత్ర సాగించిన లోకేష్‌.. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బ‌ద్వేలులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్.. తానూ రాయలసీమ వాసినేనంటూ వ్యాఖ్యానించారు. త‌న‌లో ఉన్న‌దీ రాయలసీమ ర‌క్త‌మే అని అన్నారు. ఈ విష‌యాన్ని వైసీపీ నేత‌లు తెలుసుకోవాలని, స‌వాల్ చేయాలంటే చ‌రిత్ర ఉండాలని, అడ్డుకోవాలంటే ద‌మ్ముండాల‌ని, ఈ రెండూ వైసీపీ నేత‌ల‌కు లేవ‌న్నారు.

నారా లోకేష్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందించారు. లోకేశ్ విమ‌ర్శ‌ల‌పై అవినాష్‌రెడ్డి అదిరిపోయే పంచ్ విసిరారు. తాను కూడా రాయలసీమ వాసినే అని లోకేశ్ చెప్ప‌డంపై అవినాష్‌రెడ్డి మండిప‌డ్డారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేష్‌కు తాను ఈ ప్రాంత వాసినన తెలియరాలేదా? అని ప్రశ్నింఆచరు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్న లోకేష్‌.. అధికార వైసీపీ పార్టీపై అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. 14 ఏళ్ల పాలనా కాలంలో చంద్రబాబుకు గుర్తుకు రానీ రాయలసీమ.. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ లోకేష్‌ని అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. లోకేష్‌ చెప్పే మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఇ

ప్పటికే రాయలసీమలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా తమపై చేసిన విమర్శల్ని స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చివరిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫైనల్ టచ్ అన్నట్లుగా లోకేష్ వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు. పాద‌యాత్ర‌లో భాగంగా ఆ ప్రాంత ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన‌డానికి తాను కూడా సీమ వాసినే అని లోకేశ్ చెప్పుకోవాల్సి రావ‌డం ద‌య‌నీయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త‌మ‌కు తాముగా సీమ వాసులుగా చంద్ర‌బాబు, లోకేశ్ స‌ర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితిని తెచ్చుకున్నారని పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం లోకేశ్‌ను అవినాష్‌రెడ్డి ప్ర‌శ్నించిన అంశం చ‌ర్చ‌నీయాంశ‌ంగా మారింది. 

Tags:    

Similar News