Iran : ఇరాన్ ఓడ ప్రమాదంలో సింహాచలం మృతి.. నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరి

ఇరాన్ లో జరిగిన ఓడ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు;

Update: 2023-12-28 01:33 GMT
simhachalam, died, ship accident,  srikakulam district, andhra pradesh

ship accident

  • whatsapp icon

ఇరాన్ లో జరిగిన ఓడ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఆలస్యంగా తెలిసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఇరాన్ లో జరిగిన ఓడ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బొగాబెణఇ పంచాయతీ లోని జెన్నాఘాయి గ్రామానికి చెందిన 21 ఏళ్ల సింహాచలం మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

నేవీలో చేరి...
ఇరాన్ లో మూడు రోజుల క్రితం ఓడ మునిగింది. ఈ ప్రమాదంలో సింహాచలం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. సింహాచలం నెల రోజుల క్రితమే మర్చంట్ నేవీలో చేరాడు. ఇంటర్మీడియట్ చదివిన సింహాచలం రాజస్థాన్ కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా నేవీలో చేరాడు. ఇరాన్ సముద్రంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓడ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సింహాచలం మరణించాడు. సింహాచలం మృతదేహాన్ని గ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News