స్మార్ట్ ఫోన్ కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన కొడుకు.. దెయ్యం పట్టిందనుకొని..
బెణకల్లుకు చెందిన మహేష్ (19) అనే యువకుడు ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేశాడు. తనకు చదువుపట్ల ఆసక్తి లేదని, పనిచేసుకుంటానని
ఆనందంగా గడిచిపోతున్న జీవితాల్లో స్మార్ట్ ఫోన్ రేపిన చిచ్చు ఇది. అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తే.. జీవితాలు నాశనమవుతాయనేందుకు ఇదొక ఉదాహరణ. స్మార్ట్ ఫోన్ కు బానిసైన యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. కొడుక్కి దెయ్యం పట్టిందనుకున్న తల్లిదండ్రులు.. తాయత్తులు కట్టించారు. అయినా మార్పు లేకపోవడంతో.. ప్రైవేటు ల్యాబ్ కు తీసుకెళ్లగా అక్కడ అసలు విషయం తెలిసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని బెణకల్లు లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
Also Read : సమ్మె అనివార్యం.. పీటముడి పడినట్లే
బెణకల్లుకు చెందిన మహేష్ (19) అనే యువకుడు ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేశాడు. తనకు చదువుపట్ల ఆసక్తి లేదని, పనిచేసుకుంటానని చెప్పి.. తాపీ పనులకు వెళ్లేవాడు. చదువు మానేసినా.. పనులు చేసుకుంటున్నాడు కదా అని ఆ తల్లిదండ్రులు సంతోషించారు. కానీ.. ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తాపీ పనులను వెళ్లగా వచ్చిన డబ్బులతో స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు మహేష్. అదే అతని జీవితం పాలిట శాపమైంది. స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి దానికి బానిసయ్యాడు. పబ్జీ గేమ్ ను ఇన్ స్టాల్ చేసి.. రేయింబవళ్లు అదే ఆడుతుండేవాడు. పనులకు కూడా వెళ్లడం మానేశాడు. అలా మూడు నెలలుగా నిద్రకు దూరమయ్యాడు.
Also Read : రైలు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య !
నిద్ర లేకుండా స్మార్ట్ ఫోన్ కు బానిసవ్వడంతో.. అది అతని ఆరోగ్యంపై ప్రభావం చూపింది. మానసిక స్థితి దెబ్బతింది. ఇతరులు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేని స్థితికి చేరాడు. నిక్షేపంలా ఉన్న కొడుకులో.. ఊహించని మార్పు చూసిన తల్లిదండ్రులు.. దెయ్యం పట్టి ఉంటుందని భావించి మంత్రగాడివద్దకు తీసుకెళ్లి.. మంత్రాలు వేయించి, తాయెత్తులు కట్టించారు. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో.. గురువారం కణేకల్లులోని ఓ ప్రైవేటు ల్యాబ్ కు తీసుకెళ్లారు. అక్కడున్న టెక్నీషియన్ వివరాలు తెలుసుకుని, అతడిని పరీక్షించి.. మానసిక స్థితి దెబ్బతిన్నట్లు చెప్పారు. అందుకు కారణం అతను వాడుతున్న స్మార్ట్ ఫోన్ అని, ట్రీట్మెంట్ కోసం వైద్య నిపుణులను కలవాలని సూచించారు. ఇలా ఒక స్మార్ట్ ఫోన్ ఒక యువకుడి జీవితాన్ని తలక్రిందులు చేసింది. తల్లిదండ్రులు ఇప్పటికైనా మేల్కొని.. పిల్లలు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ కు అంకితమవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.