నిమజ్జనోత్సవంలో అపశృతి.. ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. అలల తాకిడి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లా..

Update: 2022-09-12 07:42 GMT

ఎంతో సందడిగా.. తీన్ మార్ డప్పులు, డ్యాన్సులతో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. అలల తాకిడి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో చోటుచేసుకుంది. ఆరుగురు విద్యార్థులు వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా.. భారీ అలలు వచ్చాయి.

భారీ అలల తాకిడికి ఆరుగురు సముద్రంలో మునిగిపోయారు. తీరంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై బోటు సాయంతో నలుగురు విద్యార్థులను కాపాడారు. వారిలో వంశీ అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తమిళశెట్టి, విజయవర్థన్ రెడ్డి గల్లంతవగా వారి ఆచూకీ కోసం పోలీసులు సముద్రంలో గాలిస్తున్నారు.
నాలుగురోజుల క్రితం హర్యానా రాష్ట్రంలో జరిగిన నిమజ్జనోత్సవాల్లోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. చెరువులు, కాల్వలలో నిమజ్జనం చేస్తుండగా.. యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. సోనిపట్ లో ముగ్గురు, మహేంద్రగఢ్ లో నలుగురు యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ.. ప్రమాదవశాత్తు నీటిలో మృతి చెందారు.


Tags:    

Similar News